అవును రాజా … జబర్దస్త్ కు పోటీగా వాళ్ళు వస్తున్నారు ?

Tuesday, November 15th, 2016, 11:16:53 PM IST

posani-ramya-krishna
టివి రంగంలో జబర్దస్ కార్యక్రమం ఓ సంచలనం అని చెప్పాలి. కమెడియన్స్ వెరైటీ స్కిట్ లతో దూసుకుపోతున్న జబర్దస్త్ కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా ఉన్న నాగబాబు, రోజాలకు అంతే పాపులారిటీ దక్కింది. ఇక హాట్ హాట్ అందాలు ఆరబోసే యాంకర్స్ అనసూయ, రష్మీ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవ్వులు పంచుతూ దూసుకుపోతున్న జబర్దస్త్ కార్యక్రమం పై ఈ మధ్య అడల్ట్ షో గా కూడా పుకార్లు వస్తున్నాయి. రేటింగ్ లో కింగ్ లా ఇప్పటికి అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్న ఈ షో .. కి ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వడానికి మరో టివి షో సిద్ధం అవుతుంది ? ఇందులో… జడ్జీలుగా చేసేది ఎవరో తెలుసా.. పోసాని కృష్ణమురళి, రమ్యకృష్ణ !! వీరిద్దరూ కలిసి ఈ షో చేస్తున్నారట, ఆరోగ్యకరమైన కామెడీ తో ఈ షో ఉంటుందని, జబర్దస్త్ కు పోటిగానే ఈ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి జబర్దస్త్ ధాటికి తట్టుకునే షో ని ప్లాన్ చేశారో .. లేక ఈ షో దెబ్బకి జబర్దస్త్ పేరు ఇంకాస్త పాపులర్ చేస్తారో చూడాలి !!