జ‌పాన్‌లో బాహుబ‌లి కామిక్ సిరీస్‌

Saturday, May 19th, 2018, 02:34:35 AM IST


ప్రపంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి సిరీస్ బంప‌ర్ హిట్ కొట్టింది. చైనాలో బాక్సాఫీస్ రిపోర్ట్ ఆశించినంత లేక‌పోయినా ఒక తెలుగు సినిమా అక్క‌డ‌ 100కోట్ల వ‌సూళ్లు సాధించ‌డం అన్నది ఆషామాషీ వ్య‌వ‌హారం కానేకాదు. చైనాకు పూర్తి ఆపోజిట్‌గా జ‌పాన్‌లో మాత్రం బాహుబ‌లి-2 సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అక్క‌డ బాహుబ‌లి పాత్ర‌ల్ని జ‌ప‌నీయులు ఓ రేంజులో వోన్ చేసుకున్నారు. సినిమాని పిచ్చిగా అభిమానించారు. ప‌లు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో జ‌ప‌నీలు రాసిన స‌మీక్ష‌లు మ‌న తెలుగువారి గొప్ప‌త‌నాన్ని ప్ర‌శంసిస్తూ మెప్పుకోలు త‌నాన్ని ఆవిష్క‌రించాయి. ఇక సామాజిక మాధ్య‌మాల్లో అయితే అభిమానులు పిచ్చిగా ఈ సినిమా గురించి ప్ర‌మోట్ చేశారు.

అందుకే జ‌ప‌నీ మార్కెట్లోంచి ఇంకా ఇంకా డ‌బ్బు రాబ‌ట్టే ప‌నిలో ఉంది ఆర్కా సంస్థ. జ‌పాన్‌లో కామిక్ బుక్ సిరీస్‌ని లాంచ్ చేసేందుకు ఓ ప్ర‌ముఖ జ‌ప‌నీ కంపెనీతో ఆర్కా సంస్థ ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. బాహుబ‌లిలోని పాత్ర‌ల‌తో అద్భుత‌మైన కామిక్స్ రోల్స్‌ని డిజైన్ చేశార‌ట‌. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న‌ని ఎంతో ఇన్‌స్ప‌యిర్ చేసిన కామిక్ క్యారెక్ట‌ర్స్‌.. ఫిలింమేక‌ర్‌గా ఎదిగేందుకు స‌హ‌క‌రించాయి. ఇప్పుడు బాహుబ‌లి పాత్ర‌ల్ని కామిక్ బుక్‌గా అచ్చు వేయ‌డం ఆనందాన్నిస్తోంద‌ని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments