హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

Tuesday, February 4th, 2014, 11:00:13 PM IST


గత కొద్ది రోజుల క్రితం సినీ నటుడు మోహన్ బాబు పై పద్మశ్రీ అవార్డు ను దుర్వినియోగం చేశారనే దానిపై బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఫిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆ విషయం పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే దానిపై మోహన్ బాబు తన ప్రమేయం లేకుండానే ‘దేనికైనారెడీ’ సినిమాలో నిర్మాత పద్మశ్రీ మోహన్ బాబు అని పద్మశ్రీ ని వాడుకున్నారని వివరణ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వివరణని కోర్టు తోసిపుచ్చింది. అలాగే ఆయన పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవలా వద్ద అనే నిర్ణయాన్ని హైకోర్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కే వదిలివేసింది. దీనిని రాష్ట్రపతి దృష్టికి నాలుగువారాల్లో తీసుకెళ్లాలని కేంద్ర హోం శాఖని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పును వెల్లడించింది.