అందరి సీక్రెట్ లూ బయటకి చెప్పబోతున్న దాసరి

Sunday, November 20th, 2016, 01:58:25 PM IST

dasari
వివదాలకీ సంచలనాలకీ కేంద్ర బిందువు అయిన దాసరి నారాయణరావు తన వాగ్ధాటి తో ఎంతమందిని అయినా తక్కువ చేయగలరు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియని దాసరి నారాయణరావు పరోక్షంగా , ప్రత్యక్షంగా అందరినీ టార్గెట్ చేస్తారు. మూడున్నర సంవత్సరాలు గా ఒక పుస్తకం రాస్తున్నట్టు చెబుతున్న దాసరి. ఒక సంచలనానికి తెర తీయబోతున్నారు అనిపిస్తోంది. అందరి చరిత్రలూ తన పుస్తకం లో ఉంటాయి అని దాసరి చెప్పడం విశేషం. తన జీవితం గురించి ఈ పుస్తకం లో రాయడానికి సిద్ద పడిన దాసరి తెలుగు సినిమాకి సంబంధించి చాలా విషయాలు అందులో పెట్టా అంటున్నారు. తెలుగు సినిమా చరిత్రను అందరూ వక్రీకరిస్తున్నారని.. ఇలాగే సాగితే చరిత్ర అంతా మరుగున పడిపోతుందని.. అందుకే తన పుస్తకం ద్వారా వాస్తవాలు చెప్పాలనుకుంటున్నానని దాసరి అన్నారు. గొప్ప గొప్ప వాళ్లు అనుకున్న వాళ్ల గురించి ఎవరికీ తెలియని అసలు చరిత్ర బయటపెడతానని దాసరి అనడం ఉత్కంఠ రేపుతోంది. ఈ పుస్తకం పూర్తవడానికి ఇంకా ఏడాదిన్నర సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. అందరి చరిత్రలు చెబుతా అంటుంటే.. తెర వెనుక సంగతులు చాలానే బయట పెట్టేలా ఉన్నారు దాసరి.