RRR నుంచి సరికొత్త అప్డేట్ షూటింగ్ ఎప్పటి నుంచో తెలుసా.?

Tuesday, October 30th, 2018, 09:54:23 PM IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారన్న సంగతి తెలిసినదే,అయితే చరణ్ మరియు తారక్ లు వారి వారి సినిమాల వల్ల ఈ చిత్రానికి దూరంగా ఉన్నారు,రాజమౌళి కూడా బాహుబలి 2 తర్వాత అప్పుడు పడ్డ కష్టం అంతటికి ఇప్పుడు సేద తీరుతున్నారు.తారక్ ఎలాగో ఇప్పుడు అరవింద సమేత హిట్ తో తన విజయాన్ని ఆస్వాదిస్తూ ఈ చిత్రంలో మరో కొత్త లుక్ ని ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నారు.

చరణ్ కూడా బోయపాటి తో తీస్తున్నటువంటి సినిమా కూడా అంతిమ దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఇదే సమయంలో రాజమౌళి మరియు ఈ ఇద్దరు హీరోలతో తెరకెక్కబోతున్న షూటింగ్ కోసం ఒక క్లారిటీ వచ్చేసింది.ఈ చిత్రానికి సంబందించి ముహూర్తం నవంబర్ 5 వ తేదీన కుదిర్చినట్టు తెలుస్తుంది.అంతే కాకుండా ఇక పెద్దగా ఖాళీ తీసుకోకుండా అదే నెల 18 వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వబోతుంది అని వార్తలు వస్తున్నాయి.వీరు ఒక్కొక్కరు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో అందరికి తెలుసు,ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి బాక్సాఫీస్ మీద దాడికి దిగారు,మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments