బన్నీ మరో హిట్ ట్రాక్ తో వార్నర్.!

Tuesday, May 12th, 2020, 03:58:52 PM IST

David-Warner

మన హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మరియు ఆస్ట్రేలియా జట్టు పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు మన టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్. మన తెలుగు సినిమాల పాటలు డైలాగ్స్ తో టిక్ టాక్ లో హోరెత్తిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమా నుంచి హిట్ ట్రాక్ బుట్ట బొమ్మ సాంగ్ కు సతీ సమేతంగా చేసిన సాంగ్ ఒక్క రోజులోనే భారీ స్థాయి రెస్పాన్స్ ను రాబట్టింది.

మళ్ళీ దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ ఒకటి పేల్చి మళ్ళీ హాట్ టాపిక్ అయ్యారు. ఇదే అనుకుంటే ఇప్పుడు మరో వీడియోతో వచ్చి అదరగొట్టారు. అదే అల వైకుంఠపురములో సినిమా నుంచి మాస్ పార్టీ బీట్ రాములో రాముల సాంగ్ కు తన భార్య కూతురుతో కలిసి చేసిన సాంగ్ వదిలారు. దీనితో ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓసారి ఆ వీడియోపై లుక్కేయండి.