ఎన్టీఆర్ కు మాస్ బర్త్ డే విషెస్ చెప్పిన వార్నర్.!

Wednesday, May 20th, 2020, 01:30:41 PM IST

ఆస్ట్రేలియన్ డాషింగ్ బాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మన టాలీవుడ్ హీరోలను అందరినీ చుట్టేస్తున్నాడు. లాక్ డౌన్ వలన ఇంట్లోనే ఉండి సరదాగా టిక్ టాక్ వీడియోస్ చేస్తూ మన తెలుగు ఆడియెన్స్ కు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబుల వీడియోస్ కు టిక్ టాక్ చేసి అదరగొట్టిన వార్నర్ ఈరోజు యిఉంజి టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చారు.

తారక్ పుట్టిన రోజు కావడంతో తాను నటించిన “జనతా గ్యారేజ్” చిత్రంలోని హిట్ సాంగ్ పక్కా లోకల్ కు తన భార్యతో స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఆ తర్వాత చివరలో ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి విష్ చెప్తూ మేము ట్రై చేసాం కానీ డాన్స్ చాలా ఫాస్ట్ గా ఉంది అంటూ పోస్ట్ చేసారు. ఓసారి ఆ వీడియో మీరు కూడా చూసెయ్యండి.