“మైండ్ బ్లాక్” ఇంకా వార్నర్ ను చేరుకోలేదట.!

Sunday, May 17th, 2020, 08:29:12 PM IST


ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు మన టాలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్. ప్రతీ హీరో ఫ్యాన్స్ ఇప్పుడు వార్నర్ కోసమే మాట్లాడుకుంటున్నారు. మన టాలీవుడ్ హీరోల పాటలకు మరియు డైలాగ్స్ కు టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటే ఫ్యాన్స్ కొన్ని వీడియోస్ చెయ్యమని డిమాండ్ చేస్తున్నారు.

వాటిలో సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు సినిమాలోని “మైండ్ బ్లాక్” సాంగ్ చెయ్యమని డిమాండ్ చేస్తున్నారు. ఈ సాంగ్ ఆ చిత్రంలో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అందుకే ఈ పాటను వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

కానీ ఈ సాంగ్ మాత్రం ప్రస్తుతానికి చేయలేనని వార్నర్ చెప్తున్నాడు. తమ దేశంలో ఆ సాంగ్ ఇంకా టిక్ టాక్ లో అందుబాటులో లేదని అది వచ్చిన వెంటనే తప్పకుండ చేస్తానని సెలవిచ్చాడు. ఇప్పుడు వార్నర్ నుంచి ఈ వీడియో మోస్ట్ అవైటెడ్ గా ఉందని చెప్పాలి.