డేవిడ్ వార్నర్ మరొక సంచలనం – మహేష్ బాబు సరికొత్త పాటతో టిక్ టాక్…

Monday, May 25th, 2020, 03:48:29 PM IST

ప్రస్తుతానికి ఆయా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా అందరూ, వారి వారి పనుల్లో, వినోదాత్మకమైన కార్యకలాపాలతో మునిగిపోయారు. ఇలాగే ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ, అందరిని అలరిస్తున్నాడు. కాగా ఇటీవల వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించి అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలోని బుట్టబొమ్మ పాటకు ఆయన భార్య, కూతురితో సహా టిక్ టాక్ వీడియో చేశారు. ఆ తరువాత మహేష్ బాబు పోకిరి సినిమాలో డైలాగ్, తాజాగా ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని ఒక డైలాగ్ కి అదేవిధంగా డ్రెస్ ధరించి, టిక్ టాక్ వీడియో చేసి అందరిని అలరించిన డేవిడ్ వార్నర్ తాజాగా మరొక వీడియో కూడా చేశారు.

కాగా తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని ఒక పాటకు టిక్ టాక్ వీడియో చేశారు. కాగా “బాబు నువ్వు చెప్పు…? అంటూ సాగే ఈ పాటలో డేవిడ్ వార్నర్ తన బాట్ పట్టుకొని కనిపించి, ఆ తరువాత బాత్ ఎత్తిపెట్టి మాయమైపోతారు. ఆ వీడియో ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా పోస్టు చేయగా, ఆ వీడియో ప్రస్తుతానికి సామాజిక మాంద్యమాల్లో వైరల్ అవుతుంది. ఇంకా డేవిడ్ వార్నర్ నుండి మరెన్ని వీడియోలు వస్తాయో చూడాలి…