బిగ్ బాస్ కౌశల్ పై దీప్తి సంచలన వ్యాఖ్యలు ?

Wednesday, October 3rd, 2018, 10:58:05 AM IST

బిగ్ బాస్ రెండో సీజన్ ముగిసిపోయింది. నాని హోస్ట్ గా చేసిన ఈ రియాలిటీ షో లో నటుడు కౌశల్ విన్నర్ గా నిలవగా .. సింగర్ గీత మాధురి రన్నర్ గా నిలిచింది. మొత్తానికి ఐదుగురు ఫైనలిస్ట్ లలో దీప్తి నల్లమోతు నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా ఆమె ఓ లైవ్ చాట్ లో స్పందిస్తూ .. బిగ్ బాస్ లో పాల్గొనడం మరచిపోలేని జ్ఞాపకం అని .. ఈ షో ద్వారా అందరి మనసులు గెలుచుకున్నానని తెలిపింది.

అయితే ఈ షో లో రకరకాల గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి రకరాలుగా ప్రవర్తించాల్సి వస్తుందని చెప్పింది. నాకు కౌశల్ కు ఎక్కువగా పోటీ ఉండేదని .. అయన పై నాకు ఎలాంటి కక్ష లేదని తెలిపింది. బిగ్ బాస్ నా ఎమోషన్స్ ని, ఫైటింగ్ స్పిరిటి ని చూపించి తనను మీకు దగ్గరికి చేసిందని చెప్పింది. అయితే చాలా మంది నన్ను హీరోయిన్స్ గా చేయమని అడుగుతున్నారని, నాకు అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది.