దేవదాస్ క్లోసింగ్ కల్లెక్షన్స్

Friday, October 26th, 2018, 01:58:17 PM IST

వినాయక చవితి పండుగ ని పురస్కరించుకొని విడుదలైన నాగార్జున నాని ల చిత్రం దేవదాస్ “థియేట్రికల్ రన్” పూర్తయి ఫుల్ రన్ కలెక్షన్ రిపోర్ట్ వచ్చేసింది. ఓవరాల్ గా 70%మాత్రమే రికవరీ అయినట్టు గా రిపోర్ట్స్ ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ఓం నమో వెంకటేశాయ , రాజు గారి గాది2, ఆఫీసర్ లాంటి వరుస ప్లాపులతో సతమతవుతున్న నాగార్జున ఖాతా లో మరో ప్లాప్ వచ్చి చేరినట్లయింది. నాని దూకుడు కి కృష్ణార్జున యుద్ధం తో బ్రేక్ పడగా ఇది నాని కి వరుసగా రెండో ప్లాప్.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే థియేట్రికల్ రైట్స్ వాల్యూ 36 కోట్లు గా అంచనా వేస్తున్నారు, కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేసారు కాబట్టి అది ఎస్టిమేటెడ్ ఫిగర్ మాత్రమే. ఫుల్ రన్ లో దాదాపు 26కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. అంటే 10కోట్లు డెఫిషిట్ అన్నమాట.

దేవదాస్ ఫుల్ రన్ కలెక్షన్స్ ఈ విదంగా ఉన్నాయి :

నైజాం : 7. 12cr
సీడెడ్ : 2. 83cr
ఉత్తరాంధ్ర : 2. 70
ఈస్ట్ : 1. 37cr
వెస్ట్ : 1. 09cr
కృష్ణా : 1. 60
గుంటూర్ : 1.71
నెల్లూరు : 0. 78
టోటల్ (ఏపీ + తెలంగాణ ) : 19. 20cr
రెస్ట్ అఫ్ ఇండియా : 2. 80cr
ఓవర్సీస్ : 3. 72 cr
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ : 25. 72cr