దేవ‌దాస్ చిత్రానికి.. విష‌యం త‌క్కువ‌.. డ‌బ్బా ఎక్కువ‌..!

Friday, October 19th, 2018, 12:07:29 PM IST

టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున, న్యాచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం దేవ‌దాస్. గ‌త నెలాఖ‌రులో విడుద‌ల అయిన ఈ చిత్రం యావ‌రేజ్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలప‌డింది. నాగ్-నాని కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచినా.. చిత్రం విడుద‌ల అయ్యాక మాత్రం వారి అంచ‌నాల‌ను అందుకోలేక పోయింది. దీంతో ఆరంభంలో వ‌సూళ్ళు ప‌ర్వాలేద‌నిపించినా.. ఆ త‌ర్వాత సినిమాలో విష‌యం లేక‌పోవ‌డంతో పూర్తిగా డ‌ల్ అయిపోయాయి.

అయితే ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబ‌డి వ‌చ్చిందో లేదో కానీ ఆ చిత్ర‌ నిర్మాత అశ్వినీద‌త్ మాత్రం ప్ర‌చారం మాత్రం ఆప‌డంలేదు. సోష‌ల్ మీడియాలో అయితే ఇప్పుటికీ ఈ చిత్రానికి అన్ని కోట్ల గ్రాస్.. ఇన్ని కోస్ట గ్రాస్ అంటూ పోస్ట‌ర్లు వ‌దులుతూ ఇంకా ప్రేక్ష‌కుల్ని మ‌భ్య‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక అంతేనా అంటే అంత‌టితో ఆగ‌డంలేదు.. దేవ‌దాస్ క‌క్సెస్ మీట్‌ల పేరుతో మీడియాని పిలిచి ఈ చిత్రం మా బ్యాన‌ర్‌లోకే ఓ పెద్ద హిట్ అంటూ డ‌బ్బాలు కొడుతున్నారు. దేవ‌దాస్ చిత్రాన్ని దాదాపుగా 35 కోట్ల బ‌డ్జెట్ పెట్టారు. అయితే క‌లెక్ష‌న్లు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 25 కోట్ల లోపే అని తేలింది. దీంతో ట్రేడ్ వ‌ర్గాలు ఈచిత్రాన్ని ఎప్పుడో ప్లాప్ అని తేల్చేశారు. అయితే దేవ‌దాస్ చిత్ర యూనిట్ మాత్రం ఇప్ప‌టికీ సొంత డ‌బ్బా కొట్ట‌డం ఆప‌లేద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.