నాగార్జున సినిమా కు హీరోయిన్ దొరికేసింది…ఎవరో తెలుసా?

Friday, January 24th, 2020, 08:16:44 PM IST

మన్మథుడు2 చిత్రం తర్వాత నాగార్జున చాల గ్యాప్ తీసుకున్నారు. రొమాంటిక్, యంగ్ హీరోల మాదిరి సినిమాలు చేస్తున్న నాగార్జున కు ఈ చిత్రం తో గట్టి దెబ్బె తగిలింది. అయితే ప్రస్తుతం నాగార్జున ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. గగనం చిత్రం తరహాలో ఒక సూపర్ పాత్రని పోషిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోన్ కి సంబంధించిన సినిమా ఇది. అయితే ఈ చిత్రానికి నాగ్ కి తోడుగా ఒక హీరోయిన్ పాత్ర కావాల్సి వుంది. భిన్నమైన కథ, కథనాల్ని నాగార్జున ఎంకరేజ్ చేస్తూనే వుంటారు.

ఈ చిత్రంలో నాగ్ పక్కన నటించేందుకు దియా మీర్జా ని తీసుకున్నట్లు సమాచారం. దియా ఇప్పటివరకు చాల సినిమాల్లో నటించింది. అయితే నాగ్ సరసన రకుల్ని తీసుకుని చాల పెద్ద తప్పు చేశామని తెలుసుకున్న నాగ్, ఈ చిత్రానికి తన వయసుకి తగ్గట్లుగా తీసుకున్నట్లు సమాచారం. కథ ముఖ్య భూమిక పోషించే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కూడా కీలకం కానుంది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నారు.