హిందీ “అర్జున్ రెడ్డి” టైటిల్ లో మీరిది గమనించారా..?

Friday, October 26th, 2018, 07:14:34 PM IST

గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి అనే చిత్రం టాలీవుడ్ లో ఒక సంచలనం.విజయ్ దేవరకొండ అతని జీవితంలో ఈ చిత్రాన్ని మర్చిపోడని చెప్పాలి.ఎందుకంటే చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన విజయ్ కు ఈ చిత్రం అంత పెద్ద బ్రేక్ ఇచ్చింది.కొన్ని వివాదాలు చుట్టుముట్టినా సరే ఈ చిత్రం విడుదల తర్వాత ఆ సంచలనాన్ని ఆపలేకపోయాయి.విజయ్ తో పాటు ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా సంచలన దర్శకుడు అయ్యిపోయారు.ఈ చిత్ర విజయం చూసి వెంటనే వీటి రీమేక్ హక్కులను అటు తమిళం లోను మరియు బాలీవుడ్ లోను కొనేసుకున్నారు.తమిళ్ లో విలక్షణ దర్శకుడు బాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా హిందీలో మాత్రం సందీపే దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి గాను హిందీలో “కబీర్ సింగ్” గా టైటిల్ పెట్టారు.బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ మరియు కైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ పోస్టర్ ను ఈ రోజు వారి చిత్ర యూనిట్ విడుదల చేశారు.ఈ పోస్టర్ ని గమనించగా మన తెలుగులోని అర్జున్ రెడ్డి టైటిల్ లానే ఈ టైటిల్ కూడా ఉంది.ఇంకాస్త బాగా పరిశీలిస్తే ఈ పోస్టర్లో మరొక ఆసక్తికర అంశం కూడా మనం గమనించొచ్చు.హీరో యొక్క ఆటిట్యూడ్ ని వ్యక్తపరుస్తూ పిడికిలి..అతను చూపించే ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ కూడా వచ్చేటట్టు రెండింటిని కలిపి పెట్టారు..ఇక్కడే దర్శకుని యొక్క వైవిధ్యతని మనం గమనించవచ్చు..ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 21 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.