జెమినీ గణేశన్ ఏడుగురు కుమార్తెలను చూశారా!

Monday, May 21st, 2018, 05:26:55 PM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, మహానటి దివంగత సావిత్రి జీవిత గాథ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలయి అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రం
మహానటి. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల సహా, పలువురు సినీ ప్రముఖులు చిత్రం పై పలు విధాలుగా ప్రశంశల జల్లు కురిపిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ అద్భుత దర్శకత్వ ప్రతిభ, ప్రియాంక దత్, అశ్విని దత్ సంయుక్తంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అద్భుత నిర్మాణవిలువలతో చిత్రాన్ని నిర్మించడం వంటివి చిత్రానికి ఇంతటి ఘన విజయం దక్కేలా చేశాయి. కాగా ఈ చిత్రాన్ని మొదటినుండి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ప్రశంసిస్తుండగా, జెమినీ – అలివేలు ల కుమార్తె అయిన కమల సెల్వరాజ్ ఒకింత అసహనం వ్యక్తం చేసారు. చిత్రంలో నాన్న గారు సావిత్రిగారికి మద్యం అలవాటు చేసారని, అలానే ఆమెను మాత్రమే ప్రేమించారని,

నిజానికి నాన్నకు అంతకు ముందే అమ్మతో పెళ్లి అయిందని, అంటే మా అమ్మను ప్రేమలేకుండా పెళ్లి చేసుకున్నారా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే జెమినికి వున్న ఏడుగురు కూతుర్లు నిజానికి ఆయన ముగ్గురు భార్యల పిల్లలు కావడంతో వారి మధ్య సఖ్యత ఉండదని, పొరపచ్చాలు వచ్చాయని కొన్ని గుసగుసలు వినిపించాయి. కానీ ఇదంతా నిజం కాదని, ప్రతి ఏడాది కూడా జెమిని గణేశన్ కుమార్తెలు అందరూ కలిసి ఒక సారి కలుస్తుంటారట. మహానటి చిత్రం మంచి విజయవంతం అవడంతో జెమినీ గణేశన్ కుటుంబం గురించి పలువురు గూగుల్ వెతుకుతున్నారని సమాచారం. అయితే గత సెప్టెంబర్ లో ఈ ఏడుగురు జెమిని కుమార్తలు కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతోంది.

అందులో వున్న వారు ఎవరంటే, జెమిని మొదటి భార్య సంతానం అలిమేలు కుమార్తెలు డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవతి స్వామినాథన్, డాక్టర్ కమల సెల్వరాజ్, నారాయణి గణేశన్. ఇక సావిత్రి సంతానం విజయ చాముండేశ్వరి. ఆమెకు ఒక తమ్ముడు వున్నాడు పేరు సతీష్. ఇక పుష్పవల్లి సంతానం బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్. మొత్తం ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్న జెమినీ గణేశన్ చివర్లో నాలుగవ భార్యగా జూలియాని వివాహమాడారు……

  •  
  •  
  •  
  •  

Comments