చరిత్ర సృష్టించిన సుశాంత్ సింగ్ చివరి సినిమా.!

Saturday, July 25th, 2020, 04:27:05 PM IST

ఇటీవలే బాలీవుడ్ ఒక అద్భుతమైన నటుడుని కోల్పోయిన సంగతి తెలిసిందే. అపారమైన టాలెంట్ కలిగిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం సినీ అభిమానులను మరియు సామాన్య జనాన్ని కూడా ఎంతగానో కలచివేసింది.

దీనితో సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రాన్ని మూవీ హిస్టరీలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయేలా చెయ్యాలని అనుకున్నారు. అలా అనుకున్నట్టుగానే ట్రైలర్ నుంచి నిన్న విడుదల కాబడిన సినిమా వరకు భారీ రెస్పాన్స్ ను ఇచ్చి వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్నారు.

నిన్ననే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫ్రీ గా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని ఐఎండిబి రేటింగ్స్ లో ప్రపంచంలోనే అత్యధిక రాతిగ తెచ్చుకున్న సినిమాగా మార్చేసారు నిన్న రాత్రి అయితే ఈ చిత్రానికి 10 కి 10 రేటింగ్ తో ఫస్ట్ ఎవరు వరల్డ్ రికార్డు నెలకొల్పగా ఇపుడు అది 9.8 తో ఇంకా నెంబర్ 1 స్థానంలో ఉంది. దీనితో ఈ చిత్రం మన ఇండియాలోనే అత్యధిక రేటింగ్ రాబట్టుకున్న చిత్రంలా నిలిచి చరిత్ర సృష్టించింది.