96 రీమేక్ లో ఏ క్లారిటీ లేదంటున్న దిల్ రాజు ?

Thursday, October 11th, 2018, 03:48:11 PM IST

ఇటీవలే తమిళంలో గ్లామర్ భామ త్రిష , విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కిన 96 చిత్రం ఇటీవలే విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నాడు. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అయన ప్రయత్నాలు మొదలు పెట్టాడని .. త్రిష ఈ సినిమాలో కూడా నటిస్తుందని, నాని విజయ్ సేతుపతి పాత్రలో నటిస్తాడంటూ ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై దిల్ రాజు ని అడిగితె .. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలవడమే కాదు .. భారీ వసూళ్లతో దూసుకుపోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతోనే విడుదలకు నెలరోజుల ముందే ఈ రీమేక్ హక్కులను తీసుకున్నాను. ప్రస్తుతం ఈ సినిమా కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రిష నటిస్తుందంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇంకా ఆమెనుండి ఎలాంటి జవాబు రాలేదు. అలాగే నాని నటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది .. ఈ సినిమాలో నాని నటించడం లేదు. ఇంకా ఈ సినిమాకు ఎవరు కన్ఫర్మ్ కాలేదు .. అన్ని సెట్ అయ్యాక త్వరలోనే తెలియచేస్తా అని చెప్పాడు.