తన ఫ్యామిలీ హీరోకు బ్రేకులు వేసిన దిల్ రాజు ?

Thursday, October 25th, 2018, 07:00:42 PM IST

టాలీవుడ్ లో క్రేజీ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గత ఏడాది అందుకున్న సక్సెస్ లు ఈ ఏడూ అందుకోలేకపోయారు. గత ఏడాది ఇండియన్ సినిమా చరిత్రలో ఏ నిర్మాత వరుసగా ఆరు సక్సెస్ లు అందుకోలేదు .. కానీ అలాంటిది సాధ్యమే అని నిరూపించాడు దిల్ రాజు .. ఈ ఉత్సాహంతో అయన తన ఫ్యామిలీ నుండి ఓ హీరోని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేసాడు. తన సోదరుడు శిరీష్ తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయి కానీ ప్రస్తుతం ఈ ప్రయత్నం సైలెంట్ అయింది. దానికి కారణం ఈ ఏడాది దిల్ రాజు నిర్మించిన లవర్, శ్రీనివాస కళ్యాణం, తాజాగా హలో గురు ప్రేమకోసమే సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అయన తన ఫ్యామిలీ హీరోని లాంచ్ చేసే ప్రయత్నం పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతగా దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అయన ఫోకస్ అంతా దానిపైనే ఉంది. మరి తన తమ్ముడి కుమారుడిని వచ్చే ఏడాది లాంచ్ చేస్తాడేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments