దిల్ రాజు ఝ‌ల‌క్ మామూలుగా లేదే!

Sunday, April 1st, 2018, 11:50:49 PM IST


సినిమా రంగంలో థియేట‌ర్లు ఎవ‌రి చేతిలో ఉంటే వాళ్లే రారాజులు. ఆ కోణంలోనే ఆ న‌లుగురు అనే వ్య‌వ‌స్థ‌ను డిఫైన్ చేశారు. ఆ న‌లుగురి చేతిలోంచి ప‌రిశ్ర‌మ ఎప్ప‌టికీ బ‌య‌ట‌కు రాద‌న్న‌ది న‌గ్న‌స‌త్యం. అదంతా అటుంచితే థియేట‌ర్ల‌పై ఉడుంప‌ట్టు ప‌ట్టిన నైజాం కింగ్ దిల్‌రాజు త‌న సినిమాల రిలీజ్‌ల‌కు వేరొక సినిమా అడ్డంకి రావ‌డం ఇష్ట‌ప‌డ‌ర‌న్న‌ది తెలిసిన న‌గ్న‌స‌త్యం. ఫ‌క్తు బిజినెస్‌మేన్‌గా అలా చేయ‌డంలో త‌ప్పు లేదు. అయితే అలా చేయ‌డం ఓ సినిమాకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌న్న‌ది ట్రేడ్‌లో సాగుతున్న డిష్క‌ష‌న్‌. ఇంత‌కీ ఏ సినిమా అది? అంటే… మంచు విష్ణు – జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబినేష‌న్ మూవీ `ఆచారి అమెరికా యాత్ర‌`ఈపాటికే రిలీజ్ కావాల్సింది. అయితే ఎందుక‌నో ప‌దే ప‌దే వాయిదా ప‌డ‌డం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ సినిమాని ఏప్రిల్ 26కి పోస్ట్ పోన్ చేశార‌ని తెలుస్తోంది. అయితే పోటీబ‌రిలో నితిన్ `ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌` ఉండ‌డంతో ఈ వాయిదా ఫ‌ర్వం కొన‌సాగుతోంద‌న్న స‌మాచారం ఉంది. వాస్త‌వానికి ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ `ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌` ఏప్రిల్ 15 రిలీజ్ కానుంది. ఈ సినిమాని ప‌లు కీల‌క ఏరియాల్లో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజు, ఆ సినిమా రిలీజ్ వేళ వేరొక సినిమా పోటీకి రాకూడ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే `ఆచారి అమెరికా యాత్ర‌` రిలీజ్ వాయిదా వేశార‌న్న‌ది ట్రేడ్‌లో వినిపిస్తున్న మాట‌! ఓ మిష‌న్ ప‌నిపై అమెరికా వెళ్లిన విష్ణు, బ్ర‌హ్మీ అక్క‌డ ఆ మిష‌న్‌ని స‌క్సెస్ చేశారా? లేదా? అన్న‌ది సినిమా. ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించార‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments