దర్శకుడు బాలచందర్ కు అస్వస్థత..!

Monday, December 15th, 2014, 06:15:37 PM IST

balachandar
ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బాలచందర్ చెన్నై లోని కావేరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రముఖ హీరోలైన రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లను తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తీ కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు తమిళ నాట ఘనవిజయం సాధించాయి. తెలుగులో కూడా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలచందర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.