పవన్ చిత్రం తర్వాతే ఏదైనా…తేల్చి చెప్పిన హరీష్ శంకర్!

Monday, May 18th, 2020, 04:16:26 PM IST


పవన్ కళ్యాణ్ సినిమా కోసం దర్శకుడు హరీష్ శంకర్ సమాయత్తం అవుతున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్, ఇటీవల గద్దల కొండ గణేష్ చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే తన తదుపరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని మొదలు పెట్టిన హరీష్ శంకర్, పవన్ కోసం మరొకసారి దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు, మ్యూజిక్ వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది అంటూ తాజాగా తెలియజేశారు.అయితే ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చిత్రం తర్వాతే అంటూ హరీష్ శంకర్ తేల్చి చెప్పారు. అంతేకాక నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం కోసం పని చేస్తున్నారు. అయితే దీని తర్వాత దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో విరూపాక్ష చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నారు. అయితే పవన్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వడం తో హరీశ్ శంకర్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ రేస్ లోకి దూసుకెళ్లారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు వీరిద్దరూ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.