రామూ తాతయ్య అంటూ ఆర్జీవీ ని ఆటపట్టించిన దర్శకధీరుడు!

Monday, February 10th, 2020, 11:29:12 AM IST

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీ గా వున్నాడు. అయితే రాజమౌళి ని తన సినీ ప్రమోషన్స్ కి వాడుకొనే రామ్ గోపాల్ వర్మ ఈ సారి రాజమౌళి చేతికి చిక్కారు. రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి ఈ రోజు బిడ్డ కి జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మని టీజ్ చేసారు. మీ మనవరాలు నిన్ను ఏమని పిలవాలని కోరుకుంటున్నారు అని అడిగారు. రాము తాతా, రాము నాన్న, లేకపోతె గ్రాండ్ పా అని పిలవాలా? అంటూ అని రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

రామ్ గోపాల్ వర్మ తన కూతురు విషయంలో ఎలా వుంటారో అందరికి తెలిసిందే. ఒకసారి నా కూతురు, అల్లుడిని చూస్తుంటే బోర్ కొడుతోంది, వారిద్దరూ గొడవ పడితే బావుండు అంటూ కామెంట్ చేసిన విషయం తెల్సిందే. అయితే రాజమౌళి చేసిన పోస్ట్ ఫై నెటిజన్లు స్పందిస్తున్నారు. RRR చిత్రానికి సంబందించిన అప్డేట్ ని మాత్రం అడగడం మానడం లేదు. మరి రాజమౌళి ఈ చిత్రానికి సంబందించిన అప్డేట్ ఎప్పుడిస్తారో చూడాలి. రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తారో లేదో అన్నది కొందరికి ఆసక్తికరంగా మారింది.