పిక్ టాక్‌: లోఫ‌ర్ బ్యూటీ అదిరే ఫోజు

Sunday, April 22nd, 2018, 11:47:23 PM IST

చూడు ఒక‌వైపే చూడు.. !! అని బాల‌య్య ఏ సంద‌ర్భంలో పౌరుషంగా అన్నారో కానీ, ఇదిగో ఇక్క‌డ ఆరున్న‌ర అడుగుల నిలువెత్తు శిల్పాన్ని చూశాక స్ట‌న్న‌యిపోయి, యూత్ అటువైపే స్థిరంగా చూడ‌కుండా ఉండ‌గ‌ల‌రా? లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ, టాలీవుడ్ వ‌దిలి బాలీవుడ్ వెళ్లిపోయినా ఇంకా ఇంకా మ‌న యూత్ అటే చూస్తున్నారు. దిశా ప్ర‌తి యాక్టును ప‌రిశీలిస్తున్నారు. టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణం సాగించ‌డం, అటుపై విదేశీ బీచ్‌ల‌లో జోరుగా షికార్లు చేయ‌డం అటు ఉత్త‌రాది యూత్‌ కంటే మ‌న యూత్‌కే బాగా తెలుసు. అంత‌గా సామాజిక మాధ్య‌మాల ద్వారా బాగా చేరువైపోయింది దిశా.

రీసెంటుగానే ప్రియుడుతో క‌లిసి న‌టించిన `భాఘి 2` బంప‌ర్ హిట్ కొట్టింది. ఇదే ఉత్సాహంలో దిశా రెట్టించిన ఉత్సాహంతో ఫోటోషూట్‌ల‌కు ఫోజులిస్తోంది. త‌న స్టార్‌డ‌మ్‌ను అంత‌కంత‌కు పెంచుకునే ప‌నిలో ప‌డింది. ఇదిగో ఈ ఫోటోలో దిశా హొయ‌లు చూడు.. మునుముందు దీపిక‌కు ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇచ్చేది ఈ భామేన‌ని అంగీక‌రించాలి.

  •  
  •  
  •  
  •  

Comments