పిక్ టాక్: దిశా .. ఇలా చించుకుందేంటి?

Friday, June 7th, 2019, 06:13:49 PM IST

లోఫ‌ర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన టాప్ మోడ‌ల్ కం ముంబై బ్యూటీ దిశా ప‌టానీ అటుపై బాలీవుడ్ కే అంకిత‌మైన సంగ‌తి తెలిసిందే. ఓవైపు బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో బిజీగా ఉంది. వీట‌న్నిటినీ మించి యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ తో ఎఫైర్ సాగిస్తూ నిరంత‌రం వాడివేడిగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

కెరీర్.. ల‌వ్ ఇదంతా ఒకెత్తు అనుకుంటే కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల బ్రాండ్ ని ప్ర‌మోట్ చేయ‌డం మ‌రొక ఎత్తు అని చెప్పాలి. దిశా వ‌ల్ల సీకేకి సీకే వ‌ల్ల దిశాకి ఇమేజ్ పెరిగింది. నెటిజ‌నుల్లో .. యువ‌త‌రంలో అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. 2018 దీపావ‌ళి మొద‌లు యూత్ నిరంత‌రం దిశా గురించే క‌ల‌వ‌రిస్తున్నారంటే అదంతా సీకే పుణ్య‌మే. అదంతా స‌రే.. దిశా కేవ‌లం సీకే బ్రాండ్ కే కాదు.. తాను ఏ దుస్తుల్ని ధ‌రిస్తే ఆ బ్రాండ్ కి అంబాసిడ‌ర్ కిందే లెక్క‌.

తాజాగా దిశా ఇన్ స్టాగ్ర‌మ్ లో మ‌రో కొత్త లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈసారి వైట్ టాప్.. చినుగుల జీన్స్ తో అద‌ర‌గొట్టింది. ట్రాయ్ సుంద‌రిని పోలిన దివ్య రూపం.. రోమ‌న్ బ్యూటీని త‌ల‌పించే ఆ రింగుల జుత్తు.. కాటుక క‌ళ్ల‌తో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. ఓపెన్ టాప్ షోల్డ‌ర్ లుక్ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. సింపుల్ బ్లూ జీన్స్ .. తొడ భాగంలో చినుగుల‌తో బోయ్స్ హార్ట్ ని బ‌ర్న్ చేస్తోంది. మొత్తానికి ఈ లుక్ జోరుగా వైర‌ల్ అయిపోతోంది. దిశా న‌టించిన భార‌త్ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే.