2.0 టీం షాక్..ఈ చిత్రంలో రెండు కాదు మూడు పాటలు..!?

Tuesday, November 6th, 2018, 10:13:37 PM IST

2.0 చిత్రం ఇప్పుడు భారతదేశ సినీ పరిశ్రమలో ఒక హాట్ టాపిక్, ఈ చిత్ర ట్రైలర్ తో శంకర్ అంచనాలను మరింత స్థాయికి తీసుకెళ్లిపోయారు.తలైవా రజిని,శంకర్ మరియు అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో 450 కోట్ల భారీ వ్యయం తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.అయితే తన చిత్రాల్లో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శంకర్ ఈ చిత్రంలో కేవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

దీనితో సంగీత ప్రియులు కాస్త నిరాశ చెందారు.వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఎన్నో చిత్రాల్లో అద్భుత పాటలున్నాయి.కానీ కేవలం ఈ చిత్రంలో రెండు పాటలే ఉండటంతో అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.అయితే ఈ దీపావళి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ 2.0 సినిమాలో రెండు కాదు మూడు పాటలు ఉన్నాయంటూ అభిమానులను,ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు.దీపావళి స్పెషల్ గా ఈ మూడో పాటను వారు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 29 న విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments