లేటెస్ట్ అప్డేట్ : పవన్ రీఎంట్రీ కి పారితోషకం ఏంతో తెలుసా…?

Monday, December 16th, 2019, 12:24:30 PM IST

సినిమాల్లో ఒక రకమైన ట్రెండ్ ని సృష్టించి, ఆ తరువాత ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరితో మమేకమవుతూ, ప్రజాసమస్యలకై నిత్యం పోరాటం చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి… అయితే హిందీలో సూపర్ హిట్ అయినటువంటి పింక్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించనున్నారని, ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తాడని పుకార్లు బాగా వస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారని సమాచారం.

ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో బాగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి ఎలాగోలాగు దిల్ రాజు, పింక్ రీమేక్ కోసమని పవన్ కళ్యాణ్ ని ఒప్పించారు. అయితే ఈ చిత్రానికి గాను దిల్ రాజు, పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల పారితోషికాన్ని ఇవ్వనున్నట్టు సమాచారం. దానికి తోడు మరొక 20 కోట్ల రూపాయలు పెట్టి, ఈ చిత్రాన్ని పూర్తీ చేయాలనుకున్నట్లు సమాచారం. అంటే ఈ చిత్రానికి గాను దిల్ రాజు మొత్తం 70 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాడని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబందించిన వివరాలు అన్ని కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.