అర్జున్ రెడ్డి తమ్ముడికి తాకిన నెగిటివ్ టాక్..!

Thursday, June 6th, 2019, 05:33:09 PM IST

టాలీవుడ్‌లో ఒకతి రెండు సినిమాలతోనే సెన్సేషనల్ హీరోగా పేరు సంపదించారు విజయ్ దేవరకొండ. అయితే ఈయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాలలోకి వచ్చారు. అయితే కేవీఆర్ మహేంద్ర డైరెక్టర్‌గా తెరకెక్కుతున్న దొరసాని అనే చిత్రంలో హీరోగా ఆనంద్ దేవరకొండ, హీరోయిన్‌గా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటించబోతున్నారు. తెలంగాణలో 80వ దశాబ్ధంలో జరిగిన ఓ నిజజీవిత ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి కథ మొత్తం పల్లెటూరి వాతవరణం చుట్టే తిరుగుతుంటుంది. అప్పట్లో సంపన్నులుగా పిలవబడే దొరల కుటుంబానికి చెందిన ఆడపడుచుగా శివాత్మిక నటిస్తుంది. ఇక ఎప్పటిలాగే పేదవాడి క్యారెక్టర్‌లో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య చూపుల కలయికతో ఏర్పడిన బంధం ప్రేమ బంధంగా మారుతుంది. ఈ విషయం శివాత్మిక ఇంట్లో తెలియడంతో ఆనంద్ దేవరకొండను పట్తుకుని చిత్ర హిమసలు పెడతారు. అయితే ఇంతకు ఈ సినిమాలో వారిద్దరు కలుసుకుంటారా, వారికి పెళ్ళి జరుగుతుందా లేక విడిపోతారా అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సినిమా టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్‌కి సోషల్ మీడియాలో నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హీరోగా నటిస్తోన్న ఆనంద్ దేవరకొండపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. టీజర్ లో అతడి లుక్స్, నటన ఏమీ బాగోలేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్‌లు.