కామసూత్ర వెబ్ సిరీస్ తీస్తానంటున్న ఏక్తా కపూర్?

Thursday, October 25th, 2018, 10:45:01 AM IST

బాలీవుడ్ లో ముక్యంగా నిర్మాతగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలాజీ టెలీఫిల్మ్స్ ఓనర్ అయినా ఏక్తా కపూర్ ఎప్పుడైతే .. విద్యాబాలన్ ను పెట్టి డర్టీ పిక్చర్ అంటూ సంచలనం రేపిందో అప్పటినుండి ఈ అమ్మడు బూతు కంటెంట్ కె ఎక్కువ కనెక్ట్ అయింది. తాజగా ట్రిపుల్ ఎక్స్ అంటూ ఓ బూతు వెబ్ సిరీస్ చేసింది .. నిజానికి దాన్ని సినిమాగా తీద్దామని అనుకుంది కానీ సినిమాకు సెన్సార్ ఉంటుంది .. తీసిన హాట్ సీన్స్ అన్ని కట్ చేసిపారేస్తారు .. తీసి వెస్ట్ అని అనుకుందో ఏమో .. దాన్ని వెబ్ సిరీస్ గా మార్చేసి తీసింది. ఈ మద్యే విడుదలైన ఆ వెబ్ సిరీస్ పోర్న్ సినిమాకంటే దారుణంగా ఉందంటూ అటు విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి .. దాంతో సెన్సార్ వాళ్ళు .. వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ పెట్టాలన్నంతగా ఆమె ట్రిపుల్ ఎక్స్ ఉందంటే ఆ రేంజ్ బూతో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగకుండా ఈ అమ్మడు మరో సంచలన చిత్రానికి సన్నాహాలు మొదలు పెట్టింది. అది కూడా వెబ్ సిరీస్ లోనే చేస్తుందట .. ఇంతకీ ఆ సంచలన చిత్రం ఏమిటో తెలుసా .. కామసూత్ర !! ఇక దానిగురించి చెప్పేది ఏముంది .. కామసూత్ర అంటే ఏ రేంజ్ హాట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .. మరి ఏక్తా కపూర్ ఫోకస్ అంతా ఇలా బూతు కంటెంట్ పై పడడంతో అందరు షాక్ అవుతున్నారు .. ముందు ముందు ఈ అమ్మడు ఇంకెలాంటి సిరీస్ లు చేస్తుందో అని. అన్నట్టు ట్రిపుల్ ఎక్స్ లో నటించిన నటీనటులతోనే ఈ సిరీస్ ఉంటుందని టాక్ !!

  •  
  •  
  •  
  •  

Comments