పిగ్గీ.. సో క్యూట్ ల‌వ్‌లీ డార్లింగ్‌!!

Sunday, October 7th, 2018, 12:47:25 AM IST

కాకి పిల్ల కాకికి ముద్దు! అంటారు. కాకి మాటేమో కానీ, ఇదిగో ఇక్క‌డ పందిపిల్ల ఎమీకి ముద్దొచ్చింది. అందుకే ఇలా ద‌గ్గ‌ర‌కు తీసుకుని సుతారంగా ఎలా ముద్దాడేస్తోంది. ప్రియుడు జార్జి ప‌నాయ‌ట్టుకి ఇచ్చిన‌ట్టే ఎలా ముద్దు ఇచ్చేందుకు ఏమాత్రం మొహ‌మాట ప‌డేట్టు లేదు.

ఇంత‌కీ ఈ గిఫ్ట్ ఇచ్చింది త‌న లండ‌న్ ప్రియుడేనా? ఇంకెవ‌రైనానా? ఆ మాట ఎమీనే అడ‌గాల్సి ఉంటుంది. ఎలానూ 2.ఓ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కోసం ఎమీజాక్స‌న్ హైద‌రాబాద్‌కి వస్తుంది కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రిగా ఆ మాటేదో అడిగేయాలి. బ్రిటీష్ బ్యూటీ ఎమీ ఓవైపు ప్రేమాయ‌ణంలో బిజీ, మ‌రోవైపు ఇలా షికార్లు చేస్తూ .. యాత్ర‌ల్లో ఇలాంటి ఆస్వాధ‌న‌లు చేస్తుంటుంది. సో క్యూట్ ల‌వ్‌లీ డార్లింగ్ తో స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేస్తోందిలా!! అన్న‌ట్టు ఇదే పందిపిల్ల‌ను `అదిగో` డైరెక్ట‌ర్ ర‌విబాబు చూసి ఉంటే ఏమ‌య్యేదో? ఓసారి ఊహించుకోండి ప్లీజ్‌!!