గెట్ రెడీ : ఈటీవీలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అప్పటి నుంచే.!

Friday, June 19th, 2020, 02:55:53 PM IST

లాక్ డౌన్ మూలాన మన తెలుగు ఆడియన్స్ కు బోలెడంత కొత్త వినోదం మిస్సయ్యింది. దీనితో అన్ని ఛానెల్ వారు కూడాను పాతదే అయినా వారి ఉన్న సమాచారాన్ని కాస్త కొత్తగా అందించారు. ఆ విషయంలో కూడా టాప్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి ఈటీవీ ఛానెల్ అత్యధిక ఇంప్రెషన్స్ తో టాప్ లో నిలిచింది.

షోలు అయినా ఈవెంట్స్ కి అయినా పెట్టింది పేరు “ఈటీవీ”. ఈ ఛానెల్లో ప్రసారం అయ్యే ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి ఛానెల్ ఇప్పుడు మళ్ళీ తమ ఫ్రెష్ స్టఫ్ ను తమ వీక్షకులకు అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ జూన్ 22 నుంచి అన్ని కార్యక్రమాలు పునః ప్రారంభం అవ్వనున్నట్టుగా తెలుపుతున్నారు. సో మళ్ళీ ఈటీవీ ప్రేక్షకులకు నవ్వుల పంటలు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ రావడం ఖాయం అని చెప్పాలి.