నిర్మాతగా మారుతున్న నిన్నటితరం హీరోయిన్ ?

Thursday, April 19th, 2018, 10:41:23 PM IST


ఈ మధ్య కొందరు హీరోయిన్స్ కేవలం సినిమాల్లో హీరో పక్కన నటించడమే కాకుండా నిర్మాతగా అడుగులేస్తూ సత్తా చాటుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ భామలు ముందు వరసలో ఉన్నారు. తాజాగా సౌత్ లో వాళ్ళను ఫాలో అవుతున్న హీరోయిన్స్ కూడా పెరుగుతున్నారు. ఇప్పటికే క్రేజీ భామ సమంత కూడా నిర్మాతగా మారింది. ఇప్పుడు మరో మాజీ హీరోయిన్ కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని షాక్ అవుతున్నారా ? ఆమె ఎవరో కాదు సదా. 2000 దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న సదాకు తాజాగా ఓ మంచి అవకాశం దక్కింది. టార్చిలైట్ పేరుతొ తెరకెక్కే సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాతో సదా మళ్ళీ తన కెరీర్ గాడిలో పడుతుందనే నమ్మకంతో ఉంది. టార్చిలైట్ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు మజీద్ తో తాను ఓ సినిమా నిర్మిస్తానని చెప్పిందట. సో నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టేందుకు రెడీ అయింది సదా !!

  •  
  •  
  •  
  •  

Comments