అర్జున్ నిజంగా జెంటిల్ మెన్ అంటున్న మాజీ హీరోయిన్ ?

Wednesday, October 24th, 2018, 11:52:08 PM IST

ప్రస్తుతం మీ టూ వ్యవహారంలో పలువురు హీరోయిన్స్ తమపై జరుగుతున్న అరాచకాల గురించి గొంతెత్తి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ పరిణామం మంచిదే అని అనుకునేలోగా మరికొందరు కావాలని తమ పబ్లిసిటీ కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్న ప్రచారము జరుగుతుంది. తాజాగా సౌత్ హీరో అర్జున్ పై కూడా ఓ హీరోయిన్ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ కామెంట్స్ చేయడం కోలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. శృతి హరిహరన్ అనే హీరోయిన్ అర్జున్ తనను ఆ ఉద్దేశంతో రకరకాలుగా తడిమేసాడంటూ ఈ మద్యే స్పందించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అర్జున్ కుమార్తె కూడా తన తండ్రి మంచి వాడని.. శృతి కావాలని ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఇచ్చిందంటూ ఫైర్ అయింది. తాజగా అర్జున్ కు సపోర్ట్ ఎక్కువవుతుంది.

లేటెస్ట్ గా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా అర్జున్ గురించి స్పందించింది. అర్జున్ నిజంగానే జెంటిల్ మెన్ .. అయన పై అనవసర ఆరోపణలు చేయడం సరికాదంటూ కామెంట్ చేసింది. అర్జున్ నా మొదటి హీరో అని , గత 34 ఏళ్లుగా తాను తెలుసనీ .. ఎప్పుడు అర్జున్ తప్పుగా ప్రవర్తించడం తానూ చూడలేదని .. అర్జున్ గుడ్ మాన్ అంటూ ప్రశంశలు కురిపించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మేమిద్దరం చాలా సినిమాలు చేశామని మహిళలను గౌరవించడంలో అర్జున్ ఎప్పుడు ముందుంటాడని కితాబు ఇచ్చింది. కావాలని నువ్వు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నావంటూ శృతి హరిహరన్ కి వార్ణింగ్ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments