ఎఫ్‌-2 ఫ‌న్‌ దెబ్బ‌కి.. ఫ‌స్ట్రేషన్‌లో విన‌య విధేయ రామ‌.. టిక్కెట్లు అస్స‌లు తెగ‌డం లేదంట‌..!

Saturday, January 12th, 2019, 07:00:39 PM IST

సంక్రాంతి బరిలో ఇప్పటికే నాలుగు సినిమాలు రంగంలోకి దిగాయి… విడుదలైన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తన పంథాను చూపించుకుంటూ వెళ్తున్నాయి. కానీ ఒక్కో సినిమా ఒక్కోలా ప్రేక్షకులని ఆదరిస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు నిరాశ పరిచినప్పటికిని మరో సినిమా మాత్రం దూసుకుపోతుంది. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైనప్పటికిని కొంత డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ పేట చిత్రం కొంత వరకు మెప్పించగలిగి మంచి వసూళ్లనే రాబడుతుందని చెప్పాలి.

కానీ నిన్న విడుదలైన వినయ విధేయ రామ చిత్రం మాత్రం ఎన్నో అంచనా ల నడుమన విడుదలై ఇప్పుడు అందరిని నిరాశ పరుస్తుంది. విడుదల రోజు బుకింగ్స్ చాలా హై గా ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం కనీసం ఆ చిత్రాన్ని చూసేందుకు కూడా ఎవరు అంతలా ఆసక్తి చూపడం లేదు. ఆ థియేటర్లు అన్ని కూడా ప్రేక్షకులులేక వెలవెల బోతున్నాయి. ఈ రోజు టికెట్స్ బుకింగ్స్ చూసుకుంటే మొత్తం ఖాళీగానే కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు విడుదలైన F2 చిత్రం మాత్రం ఒక రేంజ్ లో దూసుకువెళ్తుంది. అందరిని కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ చిత్రానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. మరో వారం వరకు టికెట్స్ దొరకని విధంగా థియేటర్లు అన్ని కూడా బుక్ అయిపోయాయి…