లేటెస్ట్ అప్డట్: ఎఫ్3 సినిమా ఆగస్ట్ లో సెట్స్ మీదకు… కానీ మహేష్ అందుకు ఒప్పుకుంటాడా?

Tuesday, March 24th, 2020, 01:44:47 PM IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఏ మాత్రం బోర్ కొట్టకుండా సాగినా ఈ చిత్ర స్క్రీన్ ప్లే విషయంలో ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపించారు. అయితే గత కొద్దరోజులుగా ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ ఏడాది సరిలెరు నీకేవ్వరూ చిత్రం తో బ్లాక్ బస్టర్ దర్శకుడు గా మారిన అనిల్ రావుపుడి ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే పక్క స్క్రిప్ట్ చెక్ చేసుకున్నాక ఈ చిత్రాన్ని ఆగస్టు లో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో వెంకటేష, వరుణ్ తేజ్ లు వారి సరసన మెహ్రీన్, తమన్నా లు నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ మరొక హీరోగా నటించినున్నారు. అయితే మహేష్ ఇప్పటివరకు ఇతర హీరోలతో నటించినా మహేష్ కి సెపరేట్ ట్రాక్ పెట్టీ మెయింటెన్ చేశారు. ఈ చిత్రంలో మహేష్ వెంకటేష్, వరుణ్ లతో పూర్తి స్థాయిలో కామెడీ అందించనున్నారు. మరి మహేష్ అందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.