కులశేఖర్ గురించి అసలు నిజాలు…!

Thursday, November 1st, 2018, 10:04:16 AM IST

ప్రముఖ సినీ గేయ రచయత కులశేఖర్ హైదరాబాద్ లోని ఓ గుళ్లో దొంగతనానికి పాల్పడి, అరెస్ట్ అయ్యాడంటూ గత కొన్ని రోజులుగా మీడియా లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కులశేఖర్ చంచల్ గూడా జైల్లో ఉన్నారంటూ సోషల్ మీడియా లో వస్తున్నా వార్త గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అటు కుటుంబం, ఇటు బ్రాహ్మణ సమాజం వెలి వేయటం వల్లే ఈయన ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు అంటూ ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యం లో ఆయన కుటుంబం గురించి బాగా తెలిసిన వారు, ఆయన సన్నిహితులు మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని బయటపెట్టారు.

కులశేఖర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, ఈయన తండ్రి సంస్కృత పండితుడు. భక్తి నివేదన అనే పత్రికకు సంపాదకుడు గా పని చేసారు, తండ్రి వారసత్వంతో జర్నలిజం బాక్గ్రౌండ్ తో సినిమాల్లో అడుగు పెట్టిన కులశేఖర్ తక్కువ కాలం లోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేసి సొంతంగా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఆనతి కాలం లోనే 100కు పైగా సినిమాలకు పాటలు రాయటంతో పాటు, కొన్ని సినిమాలకు డైలాగులు రాసారు, ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల్లో బాగా ఊపు మీదున్న సమయంలో చెడు వ్యసనాలకు బానిసై అనారోగ్యం పాలవటంతో పాటు, మానసికంగా డిస్టర్బ్ అయ్యాడట. దీంతో కుటుంబ సభ్యులు అతనిని వైజాగ్ తీసుకెళ్లి వైద్యం చేయించటం తో మామూలు మనిషి అయ్యి మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ ,వచ్చారు. అయితే అలా తిరిగి వచ్చిన ఆయనకు ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో మళ్ళీ అయన అయన ఆరోగ్యం మానసికంగా క్షీణించింది.

మానసికంగా సరైన స్థితిలో లేకపోవటం వల్లే అయన దొంగతనాలు చేస్తున్నారని, బ్రాహ్మణ సమాజం వెలివేయలేదని అయన సన్నిహితులు చెప్తున్నారు. బ్రాహ్మణ సమాజం వెలివేయటంతోనే అయన బ్రాహ్మణుల పై కోపం పెంచుకొన్నారు అనటంలో నిజం లేదని, కుటుంబం ఏమి ఆయన్ను దూరంగా ఉంచలేదని, ప్రస్తుతం బ్రాహ్మణా సమాజం అండగా ఉండటంతో పాటు అయన కుటుంబం దగ్గరుండి చూసుకుంటుందని వారు చెప్పారు. ప్రస్తుతం ఆయనను జైల్లోనే ఉంచి మెరుగైన మానసిక చికిత్స అందించాలంటూ అయన కుటుంబం పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. కులశేఖర్ గురించి మీడియా, సోషల్ మీడియాల్లో లేని పోనీ పుకార్లు సృష్టించద్దని, అయన కుటుంబ సభ్యులు కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments