షాకింగ్ : ప్రభాస్ 20 పై ఫేక్ ప్రచారం.!

Tuesday, January 14th, 2020, 04:48:08 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక్క తెలుగు హీరోనే కాకుండా పాన్ ఇండియన్ హీరోగా మారి తెలుగు సినిమా ఖ్యాతిని దేశంలోని నలుమూలలా చూపిస్తున్నారు.అయితే తనకు ఇటీవలే నటించిన “సాహో” చిత్రం నిరాశపరచడంతో ఈసారి నటిస్తున్న తన 20 వ చిత్రం కోసమే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే చాలా మట్టుకు షూటింగ్ పూర్తి కాబడిన ఈ చిత్రంపై ఒక ఊహించని వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఈ చిత్రం తాలూకా కథకు సంబంధించి ఏవో అంశాలు ప్రభాస్ కు నచ్చక ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసారని ఎవరో కాదు ప్రభాస్ అభిమానులే అంటున్నారు.

అయితే వాళ్ళు నిజంగా డార్లింగ్ అభిమానులా కాదా అన్నది తెలీదు కానీ ఈ ప్రతిపాదనను మాత్రం ఇప్పుడు తీసుకొచ్చారు.అయితే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పే అని చెప్పాలి.ఇప్పటికే ఎన్నో నెలల నుంచి షూటింగ్ జరిగిన చిత్రం అందులోను కేవలం కథ విషయంలో ప్రభాస్ బయటకు వచ్చేసారని ప్రచారం చెయ్యడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదు.దానికి తోడు తన ఫ్రెండ్స్ నిర్మాణ సారధ్యంలో అంటే ప్రభాస్ కథ ఏమిటి అన్నది వినకుండానే చేసేస్తారు.సో ఇది ఖచ్చితంగా ఫేక్ ప్రచారం అని చెప్పాలి.ఈ వార్త తెలిసిన డార్లింగ్ అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా కంగుతిన్నారు.”జిల్” ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.