RRR సినిమాలో తల్లీ పాత్రకోసం 50 లక్షలు

Friday, July 19th, 2019, 11:44:17 AM IST

RRR సినిమా విడుదలకి ఇంకా ఏడాది సమయం ఉంది, అయిన కానీ RRR గురించి ఎప్పుడు ఎదో ఒక న్యూస్ అనేది హల్ చల్ చేస్తూనే ఉంది. అయితే ఈ సారి మాత్రం బిన్నంగా RRR సినిమా అప్డేట్ గురించి కాకుండా ఆ సినిమా పేరు ఉపయోగించుకొని చేసిన ఒక ఘరానా మోసం గురించి వెలుగులోకి వచ్చింది. RRR సినిమాలో తల్లీ పాత్ర ఇపిస్తానని చెప్పి ఒక న్యాయవాది దగ్గర 50 లక్షలు మోసం చేసిన సంఘటన బయటకు వచ్చింది.

హైదరాబాద్ లో ఒక కలర్ ల్యాబ్ లో పనిచేసే నరేష్ కుమార్ ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బోయినపల్లి కి చెందిన ఒక న్యాయవాదికి (73 )ఫోన్ చేసి, తన పేరు ఆదిత్య అని, RRR సినిమాకి నిర్మాతగా చేస్తున్నానని,తన పెళ్ళికి సంబంధించి విడాకుల విషయంలో కొన్ని సలహాలు ఆమె దగ్గర నుండి తీసుకున్నాడు. ఆ తర్వాత RRR సినిమాలో తల్లి పాత్ర మీకు ఇస్తానని నమ్మించి స్క్రీన్ టెస్ట్ లు, అడ్వాన్స్ లు అంటూ విడతల వారీగా ఆమె నుండి 50 లక్షలు తీసుకున్నాడు. తనని ఎంతకీ షూటింగ్ కి తీసుకొనిపోకపోవటంతో ఆమె అతనిని గట్టిగా నిలతీసింది. దీనితో అతను ఆమెని బెదిరించే స్థాయిలో వెళ్ళిపోయాడు. పరిస్థితి చేజారి పోయిందని గ్రహించిన ఆమె పోలీసు పిర్యాదు చేసింది.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతని సొమ్మును ఎంత చాకచక్యంగా వసూళ్లు చేయటంతో పాటుగా వాటిని ఎలా ట్రాన్ఫర్ చేపించుకున్నాడో తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. తన అకౌంట్ లో వేస్తె సమస్య వస్తుందని భావించి, కార్లు అద్దెకి తీసుకోని, వాటిలో రెండు రోజులు తర్వాత డబ్బులు నా దగ్గర లేవు, మీ అకౌంట్ చెప్పండి అందులో వేపిస్తానని, ఆమె నుండి కొంత సొమ్ము ఆ అకౌంట్ లో వేపించేవాడు. ఆ తర్వాత కారుకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించి మిగిలిన డబ్బు అతను తీసుకునేవాడు. అలా దాదాపు 15 మంది కారు డ్రైవర్లతో ఈ వ్యవహారం నడిపించాడు. ఇప్పుడు ఆ 15 మంది ఈ కేసులో నిందితులు అయ్యారు.