హాట్ టాపిక్: ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్…ఇదిగో క్లారిటీ!

Thursday, June 4th, 2020, 11:12:47 AM IST

కంటెంట్ కి భాష తో సంబంధం లేదు అని నిరూపించిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్. ఒకే ఒక్క కేజీఎఫ్ చాప్టర్ 1 తో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాక, భారత్ అంతటా ఎంతో ఆసక్తి రేకెత్తించిన సినిమా గా నిలిచింది. అయితే దీనికి ప్రస్తుతం సేక్వెల్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే నేడు ప్రశాంత్ నీల్ పుట్టి ఆ రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిందీ. అయితే రేడియేషన్ సూట్ లో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తి గా ఎదురు చూస్తున్నాం అని తెలిపింది.

అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలిపారు. ఎన్టీఆర్ పక్కన కూర్చుంటే న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చున్నట్లు ఉంది అని, ఈ సారి రేడియేషన్ సూట్ తో మీ ముందు ఉంట అని నందమూరి తారక రామారావు ను ఉద్దేశిస్తూ ప్రశాంత్ నీల్ వ్యాఖ్యానించారు. అయితే ఇపుడు ఓకే థీమ్ తో ఇద్దరి పోస్ట్ లు ఉండటం తో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చిత్రం ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. అభిమానులు సైతం ఈ కాంబినేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR చిత్రంలో, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా లో నటించనున్నారు. మరి వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన అప్డేట్ ఎపుడు వస్తుందో చూడాలి.