ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషయమించడంతో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. నర్సింగ్ యాదవ్ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
అయితే హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నర్సింగ్ యాదవ్ సినిమాల మీద ఉన్న పిచ్చితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. హేమాహేమీలు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నర్సింగ్ యాదవ్ సుమారు 300కి పైగా సినిమాల్లో నటించాడు. 1991లో ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం సినిమాలో నర్సింగ్ అనే పేరుతోనే విలన్ వేషం వేసిన నర్సింగ్ యాదవ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. గాయం, మాస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కిక్, ఠాగూర్, వర్షం, పోకిరి వంటి చాలా సినిమాలలో నర్సింగ్ నటించాడు. మొదట్లో విలన్ పాత్రలు చేసి, ఆ తర్వాత మెల్లమెల్లగా కామెడీ వైపు మళ్ళాడు. అటు విలన్‌గా, కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.