సోషల్ మీడియాలో “అరవింద సమేత” కలెక్షన్స్ ఫేక్ అంటూ రచ్చ..!

Wednesday, October 24th, 2018, 08:34:30 PM IST

భారతీయ సినీ ప్రస్థానంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలీదు కానీ,మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అటు కోలీవుడ్ లోను మరియు మన టాలీవుడ్ లోను మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా సాక్షిగా ఓ రేంజ్ లో అభిమానుల మధ్య గొడవలు అవుతుంటాయి.యూట్యూబ్ రికార్డుల నుంచి వారి అభిమాన నటుని యొక్క చిత్రానికి వచ్చే కలెక్షన్ వరకు వారి మధ్య ఎప్పుడూ ఏదొక గొడవ అలా జరుగుతూనే ఉంటుంది.హీరోలేమో మేము మేము బాగానే ఉంటాము మీరు కూడా అలాగే ఉండండి అని తమ అభిమానులకు సూచించినా ఒక రెండు మూడు రోజులు పాటించి వాటిని పక్కన పెట్టేస్తారు.

మరికొంత మందో.. కావాలనే ఇతర హీరో యొక్క ఫ్యాన్స్ ని రెచ్చగొడతారు.ఇప్పుడు అలాంటి రచ్చే యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క “అరవింద సమేత వీర రాఘవ” చిత్రానికి అంటుకుంటుంది.ఈ చిత్రం ముందు నుంచి మంచి టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంటే వేరే హీరోల యొక్క అభిమానులు ఇప్పుడు వాటిని ఫేక్ కలెక్షన్లు అంటూ ప్రచారం చేస్తున్నారు.ఇలాంటి ప్రచారాలకు గాను తారక్ అభిమానులు కూడా ఘాటుగానే తమ స్పందనను ఇస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ నడుస్తుంది.ఎంత పెద్ద హీరో అయినా వారి రికార్డులు,కలెక్షన్లు ఎప్పటికి శాశ్వతం కాదు రోజులు గడుస్తున్నకొద్దీ ఏ రికార్డు కూడా శాశ్వతం గా ఉండదని వారు గుర్తుంచుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments