సైరా ట్రైలర్ కోసం బారులు తీరిన అభిమానులు

Wednesday, September 18th, 2019, 06:20:43 PM IST

సెప్టెంబర్ 18 మెగా అభిమానులకి మరపురాని రోజు అని చెప్పాలి. సైరా నరసింహ రెడ్డి ఒక భావోద్వేగమైన కథ, ఈ చిత్రాన్ని పరిపూర్ణ స్థాయిలో అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి చాల కష్ట పడ్డారు. దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఈ చిత్ర ట్రైలర్ కోసం మెగా అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. దూరప్రాంతాల నుండి సైరా ట్రైలర్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ సైరా నరసింహ రెడ్డి ట్రైలర్ లాంచ్ ని చాల ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం లో చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తుండగా, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయిక గా నయనతార నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకి ప్రపంచవ్యాప్తంగా రానుంది.