మహేష్ సినిమా డే 1పై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు.!

Sunday, January 12th, 2020, 10:20:51 PM IST

సంక్రాంతి రేస్ ను తన బ్లాక్ బస్టర్ తో మొదలు పెట్టి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను సూపర్ స్టార్ మహేష్ అందుకున్నారు..మహేష్ కెరీర్ లోన్ ఎన్నడు లేని విధమైన భారీ హైప్ తో ఈ “సరిలేరు నీకెవ్వరు” చిత్రం విడుదలయ్యి.మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే మహేష్ లాంటి స్టార్ హీరో చిత్రం వస్తుంది అంటే మునుపటి రికార్డులు అన్ని బద్దలు అవ్వాల్సిందే అన్న మాట కూడా వాస్తవం.అలా ఇప్పుడు ఈ చిత్రం వసూళ్లపై కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సరైన లెక్కలు రాక ముందే ఎవరికి నచ్చిన అంకెలు వారు వేసుకొని ఆనందపడిపోతున్నారు.కొంతమంది ఏమో ఈ చిత్రానికి 40 కోట్ల గ్రాస్ వస్తుందేమో అని అనుకుంటే మరికొందరు ఏమో దానికి ఇంకో 26 పెంచేసి 66 కోట్లు అంటారు మరికొందరు అయితే ఏకంగా మన సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ చిత్రాల రేంజ్ లో 70 కోట్లకు పై చిలుకు అని అనవసరమైన ఎలివేషన్లు ఇస్తున్నారు.అయితే అసలు లెక్క ఎంత అన్నది మాత్రం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.కానీ మొదటి రోజు మాత్రం ఈ చిత్రానికి 50 కోట్లకు ఎక్కడా తగ్గకుండా వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.