మొత్తానికి మహేష్ పోస్టర్ వేసారుగా.!

Monday, March 23rd, 2020, 07:43:18 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ తో పాటుగా మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అలా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ చిత్రం ఇప్పుడు టీవిలో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్న జెమినీ టీవీ వారు తమ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి అధికార సమాచారాన్ని అంతగా ఇవ్వకున్నా ఈ ఉంగాడి రోజునే ఈ చిత్రం టెలికాస్ట్ కాబోతున్నట్టు తెలుపుతూ వచ్చారు.

కానీ సోషల్ మీడియా ప్రమోషన్స్ లో వెనక్కి తగ్గిపోయారు.కానీ ఇప్పటికి ఎట్టకేలకు ఒక పోస్టర్ ను పెట్టుకున్నారు.అందులో ఈ చిత్రం ఉగాది రోజున అంటే మార్చ్ 25న సాయంత్రం 6గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు.సో ఈ ఉగాది కి మరోసారి మాసం ఫీస్ట్ ఖాయం అని చెప్పాలి.