మొత్తానికి “సాహో” టీజర్ డేట్ వచ్చింది..ఇక రికార్డ్స్ పగులుతాయా?

Monday, June 10th, 2019, 04:56:30 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “సాహో”.బాహుబలి రెండు చిత్రాల తర్వాత ఈ చిత్రం వస్తుండడం అందులోను దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతుండడంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.అలాగే గత కొన్ని రోజులు నుంచి సినిమాకు సంబందించి చిన్న చిన్న అప్డేట్స్ వదులుతున్నా సరే ఇంకా సినిమా విడుదలకు తక్కువ సమయమే మిగిలి ఉండడంతో అభిమానులు అంతా చిన్న చిన్న అప్డేట్స్ కాదు టీజర్ ను వదలండి అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసేసారు.

దీనికి ఈ చిత్ర యూనిట్ దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం అప్డేట్ ఇస్తామని చెప్పినట్టుగానే శ్రద్దా కపూర్ పోస్టర్ ను ఒకటి విడుదల చేసి ఈ జూన్ 13న టీజర్ విడుదల చేయబోతున్నామని తెలిపారు.ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఇతర భాషల్లో కూడా తెరకెక్కుతుండడమే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.అలాంటిది ఇప్పుడు టీజర్ వస్తే దాని రెస్పాన్స్ ఎలా ఉండబోతుందా అన్నది ఇప్పుడు చూడాలి.యూట్యూబ్ లో ఇది వరకు వదిలిన జస్ట్ మేకింగ్ వీడియోకే ఊహించని స్పందన వచ్చింది.ఇప్పుడు అలాంటిది ముందు గానే టీజర్ డేట్ చెప్పి మరీ విడుదల చేస్తున్నారు.మరి ఈ టీజర్ తో ఇంతకు ముందున్న రికార్డ్స్ ఏమన్నా పగులుతాయా లేదా అన్నది చూడాలి.