గెట్ రెడీ : సెన్సేషనల్ సినిమా “కేజీయఫ్” కు టెలికాస్ట్ డేట్ వచ్చేసింది.!

Tuesday, June 30th, 2020, 05:20:33 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “కేజీయఫ్” మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో చాప్టర్ 1 దుమ్ము రేపింది. మొత్తం మన ఇండియా వైడ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యిపోయింది.

ఎన్నో సంచలనాలను రేపిన ఈ చిత్రం ఇప్పటి వరకు ఏ టీవీ చానల్ లో కూడా టెలికాస్ట్ కాకపోవడం బుల్లితెర అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఈ విషయంలో అయితే మన తెలుగు ఆడియన్స్ మరింత నిరాశలో ఉన్నారు. కానీ వారందరికీ సూపర్ కిక్కిస్తు ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నామని టాప్ ఛానెల్ స్టార్ మా వారు అనౌన్స్ చేశారు.

అతి త్వరలో టెలికాస్ట్ చేస్తామన్న ఈ చిత్రం ఇప్పుడు ఒక డేట్ తెచ్చుకుంది. ఈ వచ్చే ఆదివారం సాయంత్రం స్టార్ మా ఛానెల్లో సాయంత్రం5 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ చిత్రం టెలికాస్ట్ కానుంది. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి మనవాళ్ళు ఎంత రేటింగ్ ఇస్తారో చూడాలి.