మహేష్ సినిమా సెట్లో అగ్నిప్రమాదం..!

Tuesday, November 1st, 2016, 02:25:45 PM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా గా మురుగదాస్ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.కాగా నేడు షూటింగ్ సందర్భంగా ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెం. 87 లో ఓ సెట్ వేశారు. చిత్ర యూనిట్ టెంట్ల పై దీపావళి టపాకాయలు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.అయితే ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.దీపావళి ముగిసిగా నగరం లో టపాకాయల మోత ఇంకా తగ్గలేదనడాని ఇదే నిదర్శనం.ఈ ప్రమాదానికి సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.