ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : “ఇస్మార్ట్ శంకర్”

Wednesday, July 17th, 2019, 05:00:54 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు నిధి అగర్వాల్,నభా నటేష్ ల కాంబినేషన్ లో మొట్టమొదటిసారి టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరెక్కిన తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రం కోసం మాస్ ప్రేక్షకులు గట్టిగానే ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజే విడుదలయింది.సినిమా ఆరంభంలోనే కొంత మంది శాస్త్రవేత్తల మీటింగ్ ద్వారా కాస్త ఇంట్రస్టింగ్ పాయింట్ తో మొదలు కావడం వల్ల సినిమా మొదట్లోనే కాస్త ఆసక్తికరంగా మొదలైనట్టు అనిపిస్తుంది.సినిమాకు సంబంధించిన మేజర్ పాత్రలన్నీ ఫస్ట్ హాఫ్ లోనే పరిచయం అయిపోతాయి కానీ సినిమా టేకింగ్ లో ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది.మణిశర్మ అందించిన మాస్ బీట్ సాంగ్స్ ఫైట్స్ ఆకట్టుకుంటాయి.అయినా రామ్ ఒక్కడి మీదే భారం అంతా పడ్డట్టుగా స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించదు మరి సెకండాఫ్ అయినా సినిమాకు కీలకంగా మారుతుందో లేదో చూడాలి.