టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. హీరోయిన్ ఆలియా భట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. సీత పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 15 ఉదయం 11 గంటలకు ఈ పోస్టర్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.
Meet our #Sita in all her glory. ✨
First look of @Aliaa08 from @RRRMovie will be revealed on March 15, 11 AM. #RRRMovie #RRR@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @DVVMovies pic.twitter.com/12SKfHeXNc
— DVV Entertainment (@DVVMovies) March 13, 2021