దీపావళికి రానున్న ఫస్ట్ లుక్స్..!

Friday, November 2nd, 2018, 11:26:01 AM IST

ఈ దీపావళికి తెలుగు సినిమాలేవీ లేకుండా, దుబ్బింగ్ సినిమాలు మాత్రమే సందడి చేయబోతున్నాయి అన్న నిరాశలో ఉన్న తెలుగు సినీ అభిమానులకు ఈ వార్త కొంత ఊరటనిస్తుంది అనే చెప్పాలి. విజయ్ నటించిన సర్కార్, అమీర్ నటించిన థగ్స్ అఫ్ హిందూస్తాన్ తెలుగులో డబ్ అవుతున్నాయి ఈ చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నప్పటికీ తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదన్న వెలితి ఉంది. అయితే దీపావళికి రానున్న మూడు ఫస్ట్ లుక్స్ ఆ లోటును కొంచెంఅయినా భర్తీ చేస్తున్నాయి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కంబినేషన్ లో వస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు, కనీసం టైటిల్ కూడా కన్ఫార్మ్ చేయకపోవటం అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యం లో దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది, దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వెంకటేష్- వరుణ్ తేజ్ ల కంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ఎఫ్2 ఫస్ట్ లుక్ కూడా దీపావళికే వస్తుందంట. వీరిద్దరికి తోడుగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా దీపావళికి సందడి చేయనున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వం లో నటిస్తున్నాడు దీపావళికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట. మొత్తానికి దీపావళి ముందు రోజు కానీ, దీపావళి రోజున కానీ ఈ మూడు సినిమాలు ఫస్ట్ లుక్స్ తో సందడి చేయనున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments