టాక్సీవాలా కూడా ఫ్లాపేనా ..?

Friday, November 2nd, 2018, 01:31:23 PM IST

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి వరుస హిట్లతో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ నోటా చిత్రంతో బారి ఫ్లాప్ ని చవి చూసాడు. నోటా తర్వాత విజయ్ హీరోగా వస్తున్న సినిమా టాక్సీవాలా , జీఏ2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎస్. కే. ఎన్ నిర్మాతగా పరిచయం అవుతుండగా, రాహుక్ సాంకృత్యాన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ, చాలా సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్ 16న ఈ సినిమా విడుదల అవబోతుంది.

ఈ సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే హిట్టా ఫ్లాపా అన్న డిస్కషన్ నడుస్తుంది. కొంత మంది కత్చితంగా హిట్ అవుతుంది అంటుంటే, చాలా మంది ఫ్లాప్ అంటున్నారు. దీనికి కారణం ఈ సినిమా ముందే పైరసీ బారిన పడటమే అని తెలుస్తుంది, గీత గోవిందం సినిమా టైం లోనే టాక్సీవాలా ఎడిట్ చేయని వర్షన్ బయటికోచ్చింది. ఇంకేముంది ఎడిట్ చేయని వెర్షన్ పైరసీలో చుసిన వారంతా ఈ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. చిత్ర నిర్మాతలు అవేమి పట్టించుకోకుండా జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు, అయితే విజయ్ ఈ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తుంది. బహుశా ఈ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోవటం వల్లే విజయ్ ప్రమోషన్స్ కి రావట్లేదేమో అని అనుమానిస్తున్నారు సినీ జనాలు. అయితే ఈ సినిమా హిట్ అవటం విజయ్ కెరీర్ కి చాలా అవసరం.

  •  
  •  
  •  
  •  

Comments